NSUI: గాంధీభవన్ ముందు తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ధర్నా

by Ramesh Goud |
NSUI: గాంధీభవన్ ముందు తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిని మార్చాలని గాంధీభవన్(Gandhi Bhavan) ముందు కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు(NSUI Leader) ధర్నాకు దిగారు. గత ఆగస్ట్ నెలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా(Telangana NSUI president) యడవల్లి వెంకటస్వామి(Yadavalli Venkataswamy)ని ఏఐసీసీ(AICC) నియమించింది. అయితే ఈ నియామకాన్ని కొందరు విద్యార్థి విభాగం నాయకులు వ్యతిరేఖిస్తున్నారు. వెంకటస్వామి ఆంధ్ర(AP)కు చెందిన వ్యక్తి అని, తెలంగాణ(Telangana) విభాగం పదవులు తెలంగాణ వాళ్లకే దక్కాలని ఆరోపిస్తూ.. గతంలో నిరసనలు కూడా వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే రేపు ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు(NSUI National President) వరుణ్ చౌదరి(Varun Chowdhury) తెలంగాణ పర్యటన ఉండటంతో మరోసారి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ఎస్‌యూఐ లోని ఓ వర్గం వారు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని కాంగ్రెస్ కార్యాలయం(Congress Office) అయిన గాంధీ భవన్ ఎదుట నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా.. 'తెలంగాణ హక్కు.. తెలంగాణ యువతకే" అని, "తెలంగాణ భవిష్యత్.. తెలంగాణ చేతుల్లోనే" అని, "తెలంగాణకు తెలంగాణ నాయకత్వం.. ఉద్యమ స్పూర్తికి నిజమైన గౌరవం" అని ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే మార్చి, తెలంగాణ వ్యక్తిని నియమించాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed