- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల మూవీ.. ఆ రూమర్స్ అన్ని అవాస్తవమంటూ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీంకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని కొత్త జానర్‌లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి చిరంజీవి కమిట్ అయ్యాడు. ఈ చిత్రం కూడా పూర్తయిన తర్వాత 2026 సమ్మర్‌లో శ్రీంకాంత్ ఓదెల సినిమాని స్టార్ట్ చేసే ఉద్ధేశ్యంలో చిరు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాపై నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో పాటలు ఉండవని, హీరోయిన్ కూడా లేదని కొన్ని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటిపై నిర్మాత స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలోరి హీరోయిన్, సాంగ్స్‌కు సంబంధించి వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలే. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. స్టోరీ రైటింగ్ పూర్తవుతోంది అండ్ చాలా మంది యాక్టర్స్ కూడా ఈ సినిమాలో ఖరారు అయ్యారు’ అంటూ నిర్మాత తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.