- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC Kavitha : నెల రోజుల్లో రిపోర్ట్ ఎలా ఇస్తుంది? డెడికేటెడ్ కమిషన్ వద్ద ఎమ్మెల్సీ కవిత
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదని, డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యానించారు. సొమవారం బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Dedicated Commission Chairman) డెడికేటెడ్ కమిషన్ బుసాని వెంకటేశ్వరరావుకు 35 పేజీల ‘బీసీల సమగ్ర అధ్యయన నివేదిక’ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. బీసీలకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ.. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదని, నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇంటికి కుల గణన స్టిక్కర్లు అంటించలేదని తెలిపారు. డెడికేటెడ్ కమీషన్ ఇండిపెండెంట్‌గా పని చేయాలన్నారు. కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదని, ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు బీసీల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు.