- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'షూటింగ్ తొలిరోజే తనతో ప్రేమలో పడిపోయా'.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్స్ సుజీత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'క'. 70వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ చిత్రాన్ని చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఇక కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'క' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్లొన్న కిరణ్.. తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజావారు రాణిగారు సినిమా షూటింగ్ మొదటి రోజే రహస్య గోరఖ్‌తో ప్రేమలో పడ్డాను. అయితే ఈ విషయం కేవలం నా సన్నిహితులకు మాత్రమే తెలుసు. మా రిలేషన్ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గానే ఉంచాను’ అని కిరణ్ వెల్లడించారు. కాగా దాదాపు ఐదేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న కిరణ్, రహస్య.. ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో గ్రాండ్‌గా వీరు పెళ్లి చేసుకున్నారు.