దీపావళికి ముందే పెరిగిన వాయుకాలుష్యం.. మధ్యాహ్నం ఎమర్జెన్సీ మీడియా మీటింగ్

by Y.Nagarani |   ( Updated:2024-10-18 04:40:10.0  )
దీపావళికి ముందే పెరిగిన వాయుకాలుష్యం.. మధ్యాహ్నం ఎమర్జెన్సీ మీడియా మీటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో దీపావళికి ముందే గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ క్షీణించింది. బుధవారం గాలి నాణ్యత 230 ఉండగా.. శుక్రవారానికి 293కి పడిపోయింది. ఆనంద్ విహార్ లో 339, అలీపూర్ లో 304, బవానాలో 329, బురారీలో 339, ద్వారకా సెక్టార్ లో 8 324, జహంగీర్‌పురిలో 354, ముండ్కాలో 375, నరేలాలో 312, పంజాబీ బాగ్ లో 312, రోహిణిలో 362, షాదీపూర్ లో 337, వివేక్ విహార్ లో 327కు గాలి నాణ్యత క్షీణించింది.

రెడ్ జోన్ లో 13 ప్రాంతాలు

ఢిల్లీలోని 13 ప్రాంతాల్లో గాలినాణ్యత తీవ్రంగా పడిపోవడంతో.. ఆ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అశోక్ విహార్, ద్వారకా సెక్టార్ 8, పట్పర్ గంజ్, పంజాబీ బాగ్, రోహిణి, బావానా, బురారీ, జహంగిర్ పురి, ముండ్కా, నరేలా, ఓఖ్లా ఫేజ్ 2, షాహిద్ పూర్, వివేక్ విహార్ లలో గాలి నాణ్యత 300 పాయింట్లు దాటడంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణించింది.

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం గణనీయంగా పెరగడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బాణసంచా వాడకంపై నిషేధం విధించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. జనవరి 1 వరకూ ఢిల్లీలో బాణసంచా వినియోగంపై నిషేధం విధించింది. బాణసంచాపై నిషేధం ఉన్నా గాలినాణ్యత ఈ స్థాయిలో పడిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. 0 నుంచి 50 పాయింట్ల వరకూ ఉంటే గాలినాణ్యత బాగుందని అర్థం. 301 దాటితే గాలిలో నాణ్యత క్షీణించిందని, 400 -450 దాటితే.. తీవ్రంగా ఉందని అర్థం.

Advertisement

Next Story

Most Viewed