ఐఐటీకి వెళ్లలేక.. మేకలకాపరి అనే వార్త పై స్పందించిన సీఎం రేవంత్...

by Sumithra |
ఐఐటీకి వెళ్లలేక.. మేకలకాపరి అనే వార్త పై స్పందించిన సీఎం రేవంత్...
X

దిశ, ఆలూర్ : ఐఐటీలో చదవాలన్న ఆశ ఉన్నా.. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎంతో కష్టపడి జేఈఈ మెయిన్ లో ప్రతిభ చాటి మంచి ర్యాంకు సాధించినా, కాలేజీ ఫీజు చెల్లించ లేని దుస్థితిలో మేకల కాపరిగా మారింది. మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించింది. పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది.

అయితే రూ.3 లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో మేకల కాపరిగా వెళుతోంది. ఈ నెల 27వ తేదీలోపు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది అని వార్త సోషల్ మీడియాలో వైరల్ అయి అది కాస్తా సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరింది. దీనిపై వెంటనే సీఎం స్పందించి విద్యార్థిని చదువుకునే విధంగా కాలేజీలో సీటును కేటాయించారు.

Advertisement

Next Story