సీఎం కేసీఆర్ గెలుపు పక్కా

by Sridhar Babu |
సీఎం కేసీఆర్ గెలుపు పక్కా
X

దిశ, భిక్కనూరు : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ గెలుపు పక్కా అని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మంత్రి కేటీఆర్ హెలిప్యాడ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిన్న సాయంత్రం వరకు తన తోటే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం విస్మయానికి గురి చేసిందన్నారు. చాలామంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని

ప్రశ్నించగా సీఎం గెలుపు కోసం, పార్టీ కోసం పని చేసే నలుగురితోనైనా తన శాయశక్తులా కృషిచేసి మెజార్టీ తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ని వీడేందుకు సిద్ధపడ్డ నాయకులను దగ్గరికి పిలిపించుకొని మాట్లాడుతున్నానని వివరించారు. ఆయన వెంట సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారు శేరి సుభాష్ రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ అధ్యక్షులు లోయపల్లి నర్సింగరావు, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్దబచ్చ గారి నర్సింహారెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, సర్పంచు తునికి వేణు, రైతుబంధు సేవాసమితి చైర్మన్ బోండ్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed