- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Rashmika_Mandanna: ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్(I4C)కు బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. మొదట్లో చిన్న హీరోల సరసన నటించినా.. తర్వాత ఈ అమ్మడు నటనకు ఫిదా అయిన దర్శక, నిర్మాతలు ఏకంగా అగ్ర హీరోల మూవీల్లో అవకాశాలు ఇచ్చారు. రష్మిక నటించిన పుష్ప పార్ట్-1 అండ్ యానిమల్ చిత్రాల గురించి అయితే స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదనుకోండి. అదిరిపోయే నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు.
అయితే కొన్ని నెలల కిందట ఈ హీరోయిన్ డీప్ ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో రాజకీయకులు, మంత్రులు సైతం స్పందించారు. ఇకపోతే తాజాగా నేషనల్ క్రష్ ను ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్(I4C)కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో అభిమానులంతా రష్మికకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. కొద్ది నెలల కింద తన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అయ్యిందని తెలిపింది. కాగా ఇదంతా జరిగాక తను సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా పోరాడాలనుకున్నానని వెల్లడించింది.
ప్రతి ఒక్కరికి తప్పకుండా దీనిపై అవైర్‌నెస్ తీసుకురావాలన్నదే తన లక్ష్యం అని పేర్కొంది. ఇండియన్ గవర్నమెంట్ తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నానని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉందని వివరించింది. అలాగే దేశాన్ని సైబర్ క్రైమ్ నుంచి రక్షించాలని వెల్లడించింది. మనం ఎప్పుడూ అలర్ట్ గా ఉండడాలని పేర్కొంది. సైబర్ క్రిమినల్స్ ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తారని.. మనల్ని మనం కాపాడుకుంటూ.. దేశంలో సైబర్ క్రైమ్స్ జరగకుండా చూసుకోవాలని నేషనల్ క్రష్ చెప్పుకొచ్చింది.