ప్లాస్టిక్ సంచులు వద్దు.. జ్యూట్ సంచులే ముద్దు..

by Sumithra |
ప్లాస్టిక్ సంచులు వద్దు.. జ్యూట్ సంచులే ముద్దు..
X

దిశ, ఆర్మూర్ : ప్లాస్టిక్ సంచులు వద్దని జూట్ సంచులను వాడాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంగడి బజార్లో గల కూరగాయల మార్కెట్లో కూరగాయలు విక్రయించే వారికి, ప్రజలకు ప్లాస్టిక్ ను వాడవద్దని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ప్లాస్టిక్ వద్దంటూ మెప్మా ఆధ్వర్యంలో తయారు చేసిన జూట్ బ్యాగులను మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్ సుంకరి ఈశ్వరి రంగన్నలతో కలిసి కూరగాయలు విక్రయించే వారికి అందజేశారు.

ప్లాస్టిక్ కవర్లు కాకుండా బట్ట సంచులను వాడాలని కూరగాయలు విక్రయించే వారికి, సంతలోని వ్యాపారస్తులకు సూచించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రజలు తమకు సహకరించి ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల రాము, గంగమోహన్ చక్రు, డార్లింగ్ రమేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మెప్మా టీఎంసీ ఉదయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed