సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం సిగ్గు చేటు : Konidela Chiranjeevi

by M.Rajitha |   ( Updated:2024-10-03 05:06:19.0  )
సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం సిగ్గు చేటు : Konidela Chiranjeevi
X

దిశ, వెబ్, డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను విమర్శించబోయి అక్కినేని కుటుంబంపై మంత్రి కొండ సురేఖ(Konda Surekha) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి(Chiranjeevi) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గౌరవనీయులైన మహిళా మంత్రి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చూసి కలత చెందినట్లు పేర్కొన్నారు. వార్తల్లో నిలిచేందుకు, వారి స్వార్థ రాజకీయాల కోసం సినీ కుటుంబాలను టార్గెట్ చేసుకొని మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మంత్రి వెంటనే సినీ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story