- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండల కేంద్రంలో 20 ఏళ్లుగా ఒకే ఒక్క గాంధీ విగ్రహం.. పట్టించుకొని అధికారులు
దిశ, గాంధారి: నేటి సమాజంలో స్వాతంత్య్రం తెచ్చింది ఎవరు అని ఎవరిని అడిగిన ముందుగా గుర్తొచ్చేది మహాత్మా గాంధీ. అలాంటి గాంధీ విగ్రహం.. మురుగు కాలువ పక్కన శిధిలావస్థకు చేరుకుంది. దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో ఉన్న ఏకైక గాంధీ విగ్రహం వద్దకు ఒకరు వెళ్లాక ఒకరు పూలదండలు వేసి నివాళులర్పించడం, జయంతి వేడుకలు జరిపించడం, దండలు వేయడం, దండాలు పెట్టడంతోనే సరిపెడుతున్నారు. వివరాలలోకి వెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జడ్పిహెచ్ఎస్ నందు 20 ఏళ్ల కిందట అప్పటి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న బాలా గౌడ్ గాంధీ విగ్రహానికి అంకురార్పణ చేసి నేటికి 20 ఏళ్లు పైబడిన అదే విగ్రహం తో అటు రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు జయంతి వర్ధంతి, స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మొక్కుబడిగా దండలు వేయడం దండాలు పెట్టడంతోనే సరి పెట్టడం జరుగుతుంది. అది కాస్త రోడ్డు వెడల్పు లో భాగంగా స్కూల్ ఆవరణ భాగంలో ముందస్తు భాగం రోడ్డు విస్తరణలో పోవడంతో గాంధీ విగ్రహం కాస్త అటు రోడ్డు పక్కన డ్రైనేజీ అవతల వైపు విగ్రహం మిగిలిపోయింది. మండలంలో గల ఏకైక విగ్రహం అది కాస్త 20 సంవత్సరాలు దాటి పోయేసరికి చివరి దశలో ఉంది. నిత్యం అటు నుంచి రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు ఎప్పుడూ అందరికీ కనిపించే గాంధీ విగ్రహం కేవలం గాంధీ జయంతి, వర్ధంతి రోజున మాత్రమే దండలు వేసి వెళ్లిపోవడమే కాదు. కాస్త 20 సంవత్సరాలు గడుస్తున్న గాంధీని కూడా పట్టించుకోవాలి కదా అని నేటితరం యువకులు అంటున్నారు.
ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వివరణ
మా పాఠశాల యందు గల గాంధీ విగ్రహం కాస్త రోడ్డుకు ఆనుకొని డ్రైనేజీ వద్ద ఉండడంతో ఇదివరకే పెద్దలతో చర్చించి విగ్రహ ఏర్పాటుకు కృషి చేద్దామని కోరామని జడ్పిహెచ్ఎస్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికైనా గాంధీ అంటే నేటి తరానికి గుర్తుండిపోయేలా స్కూల్ వద్ద ఒక చౌరస్తా గా ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీని స్మరించుకునేలా ఉండాలంటే స్కూల్ ముందు మూడు చౌరస్తాలు కలిసే చోట గాంధీ చౌరస్తా గా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.:-ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు