Rain Alert: వాతావరణ శాఖ కీలక సూచన.. రెండు రోజుల పాటు ఆ జిల్లాల్లో వర్షాలు

by Shiva |
Rain Alert: వాతావరణ శాఖ కీలక సూచన.. రెండు రోజుల పాటు ఆ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) మరో కీలక సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert)ను కూడా జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణ పేట, జొగులాంబ గద్వాల, సంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి, మెదర్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

అదేవిధంగా శనివారం భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవశాలున్నాయని పేర్కొన్నారు. మరోసారి శనివారం నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story