- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోధన్ బీఆర్ఎస్ లో కలకలం..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ భారత రాష్ర్ట సమితిలో పోలీసు కేసులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ లీడర్ల పై ఎమ్మెల్యే ప్రోద్బలంతో నమోదవుతున్న కేసులు పార్టీని కలవరపెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గం గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ గా మారిన విషయం తెల్సిందే. అక్కడ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కు బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మావతి భర్త, మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గడిచిన నెలలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేను నిలదీసిన క్రమంలో శరత్ రెడ్డితో పాటు ఒక ఎంఐఎం కౌన్సిలర్ నదీం, 31వ వార్డు కౌన్సిలర్ తనయుడు అల్తాఫ్ తో పాటు మరో ఆరుగురి పై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో శరత్ రెడ్డి మినహా మిగిలిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి శరత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా మరొక భూ వివాదంలో శరత్ రెడ్డి పై ఠాణాలో కేసునమోదయ్యింది. ఈ యేడాది ఇప్పటి వరకు శరత్ రెడ్డి పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన శివాజి విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన గొడవల్లోనూ శరత్ రెడ్డి పై కేసులు నమోదయ్యాయి. మొన్నటికి మొన్న తన తల్లి పేరిట ఉన్న ట్రస్టు ద్వారా చేపట్టిన సేవాకార్యక్రమాల ఫ్లెక్సీల పై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం కొత్త వివాదానికి దారి తీసింది. రాత్రికి రాత్రే ఫ్లెక్సీలను తొలగించడంతో ఈ వ్యవహరం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
అక్కడ ఏకంగా ఏసీపీ, సీఐలు శరత్ రెడ్డిని కాంప్రమైజ్ చేసుకోవాలని బెదిరించిన వ్యవహరం వైరల్ అయిన విషయం తెల్సిందే. బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటికే ప్రోటోకాల్ నడుస్తున్న విషయం తెల్సిందే. మున్సిపల్ చైర్ పర్సన్ కు సంబంధం లేకుండానే పనులు జరుగుతున్నాయని గత కొంత కాలంగా ప్రోటోకాల్ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా శరత్ రెడ్డి పై హత్యాయత్నం కేసుతో పాటు భూ వివాదం కేసునమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపింది. ఎవరికి అందుబాటులో లేకుండా పోయిన ఈ విషయంలో బోధన్ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. తాజాగా శరత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. శరత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వదంతులు నిజమో కావో చెప్పేవారు కరువయ్యారు.
బోధన్ నియోజకవర్గం నుంచి శరత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారన్న నాటి నుంచి ఎమ్మెల్యే షకిల్ ఆమెర్ మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. గతంలోనే శరత్ రెడ్డి వివాదంలో మంత్రి కేటీఆర్ కలుగజేసుకుని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమనిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ నెలలో శరత్ రెడ్డి పై రెండు కేసులునమోదు కావడంతో బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ భవితవ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. మొన్నటికి మొన్న ఎంఐఎం నాయకుల పై ఎమ్మెల్యే హత్యాయత్నం కేసులునమోదు కావడంతో వచ్చే ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో షకీల్ ఆమెర్ ను ఓడిస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు శరత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన నేతగా ఎదుగుతున్న శరత్ రెడ్డితో వివాదం షకీల్ ఆమెర్ కే చేటు అని చెబుతున్నారు.