- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలస్యంగా రైతుల కోసం కదలిన మార్కెట్ కమిటీ అధికారులు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఆలస్యంగా నిద్ర నుంచి మేల్కొన్నారు. ఈ సీజన్ లో పసుపు ధర అద:పాతాళానికి చేరిన తర్వాత దళారుల ప్రమేయం లేకుండా ఖరీదు దారులకు రైతులు అమ్ముకునే విధంగా డైరెక్ట్ సేల్ ను ప్రారంభించారు. ఈ సీజన్ లో అత్యల్పంగా క్వింటాల్ కు రూ.4500 అమ్మకాలు జరుగడంతో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. ఏకంగా మార్కెట్ కమిటీకి తాళాలు వేసి మరీ నిరసనకు దిగారు. పసుపునకు డిమాండ్ లేదని మహారాష్ట్రలో ఎక్కువ దిగుబడి వచ్చిందని ఇక్కడ కొనుగోలు అంతంత మాత్రమే జరిగాయి.
అంతేగాకుండా గడిచిన ఏడాది కొనుగోలు చేసిన పసుపును ఖరీదుదారులు, కమీషన్ ఏజంట్లు కోల్డ్ స్టోరేజిలో భద్రపర్చుకుని ధర వచ్చిన తర్వాత అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈసారి పసుపును కొనుగోలు చేసే వారే కరువయ్యారు. ఇదే సాకు చూపి కమీషన్ ఏజంట్లు 2 శాతం కమిషన్ పేరుతో పైకి చెబుతున్నా సిండికేట్ గా మారి తక్కువ ధరకు రైతులను ముంచివేశారు. ఈ సీజన్ లో భారీ వర్షాలకు దుంపకుళ్లు తెగుళ్లు కారణంగా దిగుబడి కూడా గణనీయంగా తగ్గింది. దాదాపు 25 వేల ఎకరాల్లో పసుపు పంటను కూడా రైతులు పండించకపోవడం గమనార్హం.
దిగుబడి తగ్గడం, సాగు తగ్గిన పండిన పంటకు మాత్రం ధర లేకపోవడం రైతులను కలిచివేసింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో 92 మంది లైసెన్స్ కలిగిన కమిషన్ ఏజంట్లు ఉండగా అందులో 50 మంది మాత్రమే యాక్టివ్ గా పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. పసుపు ఖరీదు దారులు 40 నుంచి 50 మంది ఉండగా రైతులకు మాత్రం ప్రతి సీజన్ లో నిరాశ తప్పడం లేదు. గతంలో సాంగ్లీకి ఎగుమతి చేసిన రైతులు అక్కడ ఎక్కువగా సాగు పెరుగడంతో ఇక్కడే పసుపునకు ధర లేదని నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో ఆలస్యంగా గుర్తించిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారులు బుధవారం రైతులు కమిషన్ ఏజంట్ల ప్రమేయం లేకుండా నేరుగా ఖరీదుదారులకు అమ్ముకునేందుకు డైరెక్ట్ సేల్ ను ప్రారంభించారు. ఇది ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తుందో వేచి చూడాలి. బుధవారం ఈ సీజన్ లోని అత్యధికంగా క్వింటాల్ కు రూ.7684 ధర పలికినట్లు మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ సీజన్ లో 4 లక్షల క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వస్తుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.