- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > తిండి లేక భిక్షాటన చేస్తున్న.. వితంతు పెన్షన్ ఇప్పించండి సారూ..
తిండి లేక భిక్షాటన చేస్తున్న.. వితంతు పెన్షన్ ఇప్పించండి సారూ..
by Sumithra |
X
దిశ, నిజామాబాద్ సిటీ : తినడానికి తిండి లేక అడుక్కుతింటున్న, భర్త చనిపోయి ఆధారం లేక ఉన్నాను. వితంతు పెన్షన్ ఇప్పించండి అంటూ నందిపేట్ మండలం వెన్నెల్ కె గ్రామానికి చెందిన కైసర్ బెంగం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త షేక్ ఫరీద్ 2020లో చనిపోయారని డెత్ సర్టిఫికెట్ తీసుకొని వితంతు పెన్షన్ కోసం అన్నిపత్రాలతో దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు.
కానీ మూడేళ్లు గడిచినా పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయి పుట్టెడు బాధలో ఉన్న తనకు ఆధారం లేక అడుక్కోని జీవనం కొనసాగిస్తున్నానని వితంతు పెన్షన్ కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని అన్నారు. కలెక్టర్ సారు దయతలిచి నాకు వితంతు పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నామన్నారు.
Advertisement
Next Story