నాంపల్లి అగ్ని ప్రమాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య

by GSrikanth |   ( Updated:2023-11-13 06:15:10.0  )
నాంపల్లి అగ్ని ప్రమాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, కార్వాన్/మెహిదీపట్నం: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ కంపెనీ గోదాంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ నాలుగో అంతస్తుకు చెలరేగడంతో అందులో ఉన్న కార్మికులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది 7 ఫైరంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తుంది. వారిలో ఓ చిన్నారి కూడా ఉందని పోలీసులు తెలియజేశారు. కంపెనీ వద్ద ఉన్నా ఓ కారు, బైక్లు మంటల్లో కాలిపోయాయి. డీజిల్ డ్రమ్ములు పేలడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే స్థానిక డీసీపీ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలాన్ని పరిశీంచారు..

Read More: HYD: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకుని ఏడుగురు కార్మికులు మృతి!

Advertisement

Next Story