Kishan Reddy: బీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ కంటిన్యూ.. కిషన్ రెడ్డి విమర్శలు

by Prasad Jukanti |
Kishan Reddy: బీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ కంటిన్యూ.. కిషన్ రెడ్డి విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి 8.6 శాతం నిధులు కేటాయించారని విమర్శించారు. విద్యారంగానికి సంబంధించి జాతీయ సగటు కేటాయింపు 14.7 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదిగా స్పందించిన ఆయన ప్రధాన సామాజిక రంగమైన విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. అలాగే తెలంగాణ గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులు అసమర్థంగా ఉన్నాయని విమర్శించారు. గ్రామీణ వర్గాల అత్యవసర అవసరాలను విస్మరించిందన్నారు. ఈ పెట్టుబడి లేకపోవడం గ్రామీణ ప్రజల పురోగతిని దెబ్బతీస్తుందని, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా పరిష్కరించబడని పురోగతికి ఈ కేటాయింపులు ఆటంకంగా మారుతుందన్నారు.

Advertisement

Next Story