టీహబ్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు.. మంత్రి కేటీఆర్ హర్షం

by Mahesh |
టీహబ్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు.. మంత్రి కేటీఆర్ హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీ హబ్‌కు మరో జాతీయ అవార్డు వచ్చింది. భారత్​లో ఉత్తమ ఇంక్యుబేటర్​గా గుర్తింపు వచ్చింది. టీ-హబ్ కు నేషనల్ టెక్నాలజీ వార్డు-2023 వరించింది. కొత్త అంకుర సంస్థలకు చిరునామాగా మారింది. 2వేల స్టార్టరఫ్ స్థాపనలో టీహబ్ కృషి చేస్తుంది. భారత ప్రభుత్వం నుంచి టీ-హబ్‌ సీఈవో శ్రీనివాసరావు ఆదివారం అవార్డును అందుకున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

టీ-హబ్‌ నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టీ-హబ్‌ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందినదని మంత్రి తెలిపారు. అవార్డు గెలుచుకున్న టీ-హబ్‌ టీమ్‌కు అభినందనలు తెలిపారు. టీహబ్​ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే జాతీయ స్టార్టప్​ అవార్డుల్లో ఇంక్యుబేటర్​విభాగంలో ఉత్తమ అవార్డు లభించింది.

Advertisement

Next Story