అందుబాటులో లేని జడ్జి.. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

by Mahesh |   ( Updated:2024-10-16 06:46:29.0  )
అందుబాటులో లేని జడ్జి.. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పటి టీడీపీ నేత, నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 24న ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించగా.. విచారణకు మత్తయ్య హాజరు కాగా.. సీఎం రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. దీంతో అక్టోబర్ 16న బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ వాతావరణం నెలకొనగా.. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో ఈ కేసు విచారణను నవంబర్‌ 14వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కోర్టు విచారణకు హాజరు కాలేకపోయారు.

Advertisement

Next Story