- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Cabinet meeting:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చలు!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీ మంత్రివర్గ సమావేశం(AP Cabinet meeting) నేడు(బుధవారం) జరగనుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో టీడీపీ(TDP) కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) పథకాల అమలు పై చర్చలు జరుపనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానంగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ కేబినెట్(AP Cabinet) ఆమోదించనుంది.
ఈ సమావేశంలో కొన్ని బిల్లుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే కొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆర్థిక అంశాలపై కూడా ఈ సమావేశంలో(Meeting) ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ క్రమంలో కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు(Beneficiaries), పథకానికి అర్హుల ఎంపిక(Scheme Eligibility), ఆర్థిక భారం(Financial Burden) వంటి అంశాలపై చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చెత్త పన్ను రద్దు పైన ఇప్పటికే చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మున్సిపాలిటీల్లో కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదన పై కూడా మంత్రివర్గం చర్చలు జరపనుంది.