నిఘా పెట్టాల్సింది.. తప్పు చేశా.. అందుకే నా జీవితం ఇలా తయారైంది: సమంత సంచలన కామెంట్స్

by Kavitha |
నిఘా పెట్టాల్సింది.. తప్పు చేశా.. అందుకే  నా జీవితం ఇలా తయారైంది: సమంత సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత(Samantha).. ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(citadel: Honey Bunny)సిరీస్‌తో మనముందుకు రాబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man 2) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj & DK) రూపొందిన ఈ సిరీస్‌లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ భారీ అంచనాల నడుమ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. ఇక స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడుతుండటంతో సమంత ప్రస్తుతం ప్రమోషన్ల బిజీ బిజీలో ఉన్నది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సిరీస్‌లో సమంత స్పై ఏజంట్‌( Spy Agent)గా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె చేసిన పోరాట దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే దీనిని బేస్ చేసుకొని యాంకర్ ఇంటర్వ్యూలో సమంతను.. ఈ సిరీస్‌లో మీరు స్పై ఏజంట్‌గా నటించారుకదా.. నిజ జీవితంలో కూడా స్పైగా నటించారా? అని అడిగింది. దానికి సామ్ బదులిస్తూ.. ‘నిజ జీవితంలో కూడా నేను అలాగే చేయాల్సింది. అలా చేయకుండా చాలా తప్పు చేశాను. స్పైగా చేయకుండా ఉండటం వల్లే నా జీవితం ఇలా తయారైంది’ అని సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సమంత-నాగచైతన్య వివాహ బంధం గురించే అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story