Allu Arjun: ఇండియన్ స్టార్ హీరోస్ టచ్ కూడా చేయలేని రికార్డు క్రియోట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

by Prasanna |
Allu Arjun: ఇండియన్ స్టార్ హీరోస్ టచ్ కూడా చేయలేని రికార్డు క్రియోట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2 )మూవీలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక, 'పుష్ప2' మూవీ పై కూడా అదే విధంగా అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ డిసెంబర్ 6 న ఆడియెన్స్ ముందుకు రానుంది.

విడుదల డేట్ దగ్గర పడటంతో ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

'పుష్ప2' ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసి కొత్త రికార్డు క్రియోట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.660 కోట్లకు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాలల్లో రూ.220 కోట్లు కాగా.. ఇక నార్త్ ఇండియాలో రైట్స్ రూ.200 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో రూ.140 కోట్లు, డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు బిజినెస్ చేసి అల్లు అర్జున్ భారతీయ సినిమాలో ఎవరు క్రాస్ చేయని రికార్డ్ క్రియోట్ చేసాడు.

Advertisement

Next Story