శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే..

by Sumithra |   ( Updated:2025-04-01 09:24:14.0  )
శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే..
X

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మండల పరిధిలోని హనుమంతరావుపేట్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే హనుమంతరావు పేట గ్రామానికి చెందిన బేగరీ రాముల కుమారుడికి నవోదయ పరీక్షలు సీటు సంపాదించిన సందర్భంగా విద్యార్థులను అభినందించి చదువుకు, బుక్స్ లకు అవసరాల ఖర్చుల కోసం కొంత మొత్తం ఆర్థిక సాయం బాలుడికి ఎమ్మెల్యే అందించారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, దారం శంకర్ సెట్ తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వినోద్ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, రమేష్ చౌహాన్ కాంగ్రెస్ నాయకులు, పండరి రెడ్డి, నారాయణ, మాణిక్యం, మాజీ ఎంపీటీసీలు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సర్దార్ నాయక్, మల్ల గౌడ్, మాటూరి సాయిలు, డాక్టర్ శీను, విఠల్, పెద్ద సాయిలు, వెంకన్న, విశ్వనాథం, చెక్రదరి, రాములు, సాయిలు, చాకలి బాగయ్య, రామ గౌడ్, మారుతి, తంపులుర్ భూమయ్య, సంజీవులు, హనుమంతరావు పేట్ గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story