- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
by Sridhar Babu |

X
దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామంలోని చౌక ధరల దుకాణం -1 లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు గల కుటుంబాలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగేల భూషణ్, మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, రమేష్ రావు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story