దిగజారిన తమన్నా... డబ్బుల కోసం ఆ నిర్ణయం ?

by Veldandi saikiran |
దిగజారిన తమన్నా... డబ్బుల కోసం ఆ నిర్ణయం ?
X

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah Bhatia ) మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించేందుకు రంగం సిద్ధం చేసుకుందట ఆ హీరోయిన్ తమన్నా. ఈ మేరకు బాలీవుడ్ చిత్ర బృందంతో చర్చలు జరిగాయని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan ) చేసిన లేటెస్ట్ సినిమా రైడ్ 2. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మే నెలలో ఈ సినిమా అప్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు మంచి మసాలా సాంగ్ యాడ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. దీనికోసం హీరోయిన్ తమన్నాను చిత్ర బృందం. ఐటమ్ సాంగ్ చేసేందుకు తమన్నా ను అడిగితే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇప్పటికే.. పలు ఐటెం సాంగ్స్ లో కనిపించింది ఈ హీరోయిన్ తమన్నా ( Tamannaah Bhatia ) . జూనియర్ ఎన్టీఆర్ ( NTR ) నటించిన... జై లవకుశ సినిమాలో... స్వింగ్ జర అనే ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్న స్టెప్పులు వేసింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన జైలర్ సినిమాలో కూడా మెరిసింది తమన్నా. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుందట. ఇది ఇలా ఉండగా... హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో... వీరిద్దరి మధ్య గ్యాప్ కలిగిందని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed