- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూరులో భవనం కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru Building Collapse)లో నిన్న సాయంత్రం నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొలుత ఒకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరో నలుగురి మృతదేహాలు శిథిలాల కింద లభ్యమవ్వగా మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఈస్ట్ బెంగళూరులోని బాబుసప్లయా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. 17 మంది శిథిలాల కింద చిక్కుకుపోగా.. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది 14 మందిని రక్షించారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగానే భవనం ఏడు అంతస్తులు కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా.. భవనం కూలిన సమయంలో దాదాపు 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మొన్నరాత్రి నుంచీ కురుస్తున్న వర్షాలకు బెంగళూరులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నగరమంతా వరదనీటితో జలదిగ్భంధమవ్వగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ప్రభావంతో మరింత భారీ వర్షం కురిస్తే.. బెంగళూరు కూడా తీవ్ర వరదలను చూడక తప్పదు.