గోదావరి ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..

by Vinod kumar |
గోదావరి ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..
X

దిశ, భువనగిరి రూరల్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పింది. ఎస్4 నుంచి మొదలై మిగతా బోగీలన్నీ పట్టాలు తప్పిన్నట్టు అధికారులు చెబుతున్నారు. పట్టాల పై నుంచి పక్కకు ఐదు బోగీలు ఒరిగాయి. ట్రైన్‌లోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


లోకో పైలట్ వెంటనే గమనించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పిందని.. దీనిపై విచారణ చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు.


ఈ ప్రమాదం వలన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్ లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు.

Advertisement

Next Story