- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ ని కలిసిన ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు
దిశ, చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్,భువనగిరి, గజ్వేల్ భూ నిర్వాసితులు రైతులు ప్లాట్లు కోల్పోతున్న యజమానులు మంత్రి బండి సంజయ్ ని హైదరాబాదులో కలిశారు. త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను ఔటర్ రింగ్ రోడ్డు కు కేవలం 28 కిలోమీటర్ల కే పరిమితం చేశారని,దీనివల్ల చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ మున్సిపాలిటీలు రెండు మూడు భాగాలుగా విడిపోతున్నాయని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరం ఉండేలా అలైన్మెంట్ మార్చితే మున్సిపాలిటీలు విడిపోకుండా ఉండటమే కాకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో భూములు కోల్పోతున్న బాధితులకు బహిరంగ మార్కెట్ లో ఉన్న విలువ ప్రకారం.. నష్ట పరిహారం ఇప్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి గంగిడి మనోహర్ రెడ్డి, చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుప్పల్ మాజీ జెడ్పీటసీ సభ్యుడు పెద్ధిటి బుచ్చిరెడ్డి, బీజేపీ మండల నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, మారుపాక లింగం గౌడ్, కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్, చింతల సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జాల శ్రీశైలం యాదవ్, జాల జంగయ్య యాదవ్, జాల వెంకటేష్ యాదవ్, జాల నరసింహ గుండెబోయిన గాలయ్య,వేణు యాదవ్, భోగయ్య, ప్రకాష్ రెడ్డి ,జోసెఫ్, కార్తీక్ ,కనకరాజు ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.