నకిరేకల్‌ సమీపంలో దారి దోపిడీ

by Mahesh |   ( Updated:2024-08-14 17:09:57.0  )
నకిరేకల్‌ సమీపంలో దారి దోపిడీ
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకర్గంలోని జాతీయ రహదారిపై దారి దోపిడీ సంచలనంగా మారింది. హైదరాబాద్ - విజయవాడ హైవేపై స్కూటీపై వెళ్తున్న ఓ జంట నుంచి బైక్ పై వచ్చిన దొంగలు రన్నింగ్ లోనే పర్సులు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నకిరేకల్ శివారులో చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న దంపతులను గమనించిన దొంగలు బ్లాక్ కలర్ పల్సర్ బైక్ పై వేగంగా వచ్చి మహిళ చేతిలో ఉన్న పర్స్ ను లాక్కుని పారిపోయాడు.. ఎం జరిగిందో తెలిసే లోపు దొంగలు వేగంగా బైక్ పై దూసుకెళ్లారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దొంగలు పల్సర్ బైక్ పై బ్లాక్ టీ షర్ట్స్, షాట్ ధరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story