Minority State Convenor : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి..

by Sumithra |
Minority State Convenor : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి..
X

దిశ, రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె.చాంద్ డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ఆదివారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం కనీసం ఉద్యమకారుల జీవితాల గురించి ఆలోచన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోరాడుతూనే ఉందని అన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, ఇందిరమ్మ ఇండ్లలో 10 శాతం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోముల.శంకర్, బొడ్డుపల్లి లింగయ్య, ఎండి ఇమామ్ సాబ్, పూసల బాలయ్య, ప్రవీణ్, సర్ద కృష్ణ, కప్పల రవికుమార్ గౌడ్, కోనూరు శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed