- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Mandhula Samel : దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు
దిశ,తిరుమలగిరి: తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో గురువారం జరిగిన బీఆర్ఎస్-కాంగ్రెస్ పరస్పరదాడుల్లో గాయాలపాలైన కాంగ్రెస్ కార్యకర్తలను శుక్రవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్వాతి హాస్పిటల్ లో పరామర్శించారు.కార్యకర్తలకు అండగా నేనున్నానని భరోసా కల్పించి వైద్య ఖర్చులను అందించారు.తదనంతరం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల తెలంగాణలో భోగాలను అనుభవించిన బీఆర్ఎస్ బోకర్ గాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివాలాకోరు తనంతో తిన్నదంతా కక్కిస్తారనే భయానికి లోనవుతూ చిల్లర కార్యక్రమాలు చేపట్టి శాంతియుతంగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని చూటడం గురువారం కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడి చేయడం ఎమ్మెల్యే మందుల సామేల్ ఖండించారు. గత పది సంవత్సరాల పరిపాలనలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. దోసుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని,అడ్డగూడూరు మండలం జానకిపురం,చిర్రగూడూరు గ్రామాలలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వారిపై చివరికి మహిళలపై కూడా దాడి చేసి కేసులు పెట్టారన్నారు. రైతులకు రుణమాఫీ పై ఎలాంటి అపోహలు వద్దని ఎవరికైనా రుణమాఫీ కాలేదంటే..కలెక్టర్ కు గానీ మండల వ్యవసాయ అధికారి కానీ దరఖాస్తు చేసుకొని ఏవైనా సాంకేతిక లోపాలతో జాప్యం జరిగి ఉంటే సరి చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతని రైతుల పక్షాన నిలబడుతుందని ప్రజా పాలనలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు,పీఎసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్,కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు వై నరేష్,మూల అశోక్ రెడ్డి,సుంకరి జనార్ధన్,పాలకుర్తి రాజయ్య, వార్డు కౌన్సిలర్లు,ఆయా మండలాల అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.