- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెట్రోల్ బంక్‌లో కల్తీ డీజిల్,పెట్రోల్.. ఆందోళనకు దిగిన కారు యజమాని
దిశ,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకులను అధికారులు తనిఖీలు చేయడం లేదని వాహనదారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.పెట్రోల్ బంకుల ఏజెన్సీ నిర్వాహకుల వద్ద బంకుల్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు వారికి నెలసరి ముట్టజెప్పుతున్న ముడుపులకు అలవాటు పడి బంకుల్లో పెట్రోల్, డీజిల్ కల్తీ కలుస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం జనగాం క్రాస్ రోడ్ లోని పెట్రోల్ బంక్ లో పలుమార్లు కల్తీ డీజిల్, కల్తీ పెట్రోల్ వస్తుందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటీకి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.బంకుల్లో నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల, సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది. జనగాం క్రాస్ రోడ్ లోని పెట్రోల్ బంక్ లో కల్తీ డీజిల్,పెట్రోల్ పలుమార్లు రావడంతో వాహన వినియోగదారులు గొడవకు దిగారు.సిబ్బంది సైతం దురుసుగా మాట్లాడడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని బంక్ సిబ్బందిని మందలించారు.కాగా వాహనదారులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.