Jathara: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కొత్త మూవీ ట్రైలర్

by Prasanna |   ( Updated:2024-10-30 07:33:44.0  )
Jathara: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కొత్త మూవీ ట్రైలర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద హిట్ కొడుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికి ప్రూవ్ అయింది. చిన్న హీరోలు కొత్త సినిమాలు తీసి చాలా పాపులర్ అయ్యారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు.

మరికొందరు వారి టాలెంట్‌తో సినిమాలను డైరెక్ట్ చేస్తూ.. ఆ మూవీలో హీరో గా నటిస్తూ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అలా వచ్చిన కాంతారా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే, ఇప్పుడు మరో కొత్త మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

సతీష్ బాబు రాటకొండ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ‘జాతర’. ఈ మూవీలో అతనే హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 8న ఈ మూవీ థియేటర్లలో సందడీ చేయనుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. విజువల్స్, ఆర్ఆర్ ఇలా ప్రతిదీ సినీ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Next Story