కిరణ్ అబ్బవరంపై ట్రోల్స్.. మాస్ కా దాస్ రియాక్షన్ ఇదే! (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-10-30 07:00:21.0  )
కిరణ్ అబ్బవరంపై ట్రోల్స్.. మాస్ కా దాస్ రియాక్షన్ ఇదే! (పోస్ట్)
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘క’. సుజిత్, సందీప్(Sujith, Sandeep) తెరకెక్కించిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ (Tanvi Ram)హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ఓ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ‘‘నేను అవకాశం కోసం ఎవరిని అడగలేదు. ‘రాజావారు రాణిగారు’ చేశాను. తర్వాత పలు సినిమాల్లో నటించాను. అయితే ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’(SR Kalyanamandapam) తర్వాత నుంచి నాపై ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు అంటున్నారు. అసలు వాళ్ల ప్రాబ్లం ఎంటో నాకు అర్థం కావడం లేదు. నేను అసలు కూలి పని చేసుకునే కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చాను.తెరపై సరిగా కనిపించకపోవడానికి కారణం అందంగా లేక కాదు. నిద్రలేక అలా కనిపించి ఉంటా. నా గురించి ట్రోల్స్ చేసేవారికి నేనేం అపకారం చేశా.

4 సంవత్సరాల నుంచి 8 సినిమాను చేశా’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)కు సపోర్ట్‌గా విశ్వక్(Vishwak Sen) ‘X’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నీకు మరింత పవర్ చేకూరాలని ఆశిస్తున్నా. ‘క’(Ka ) మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ‘క’(Ka ) మూవీ పోస్టర్ షేర్ చేశారు. ప్రజెంట్ విశ్వక్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

Next Story