Eco friendly Diwali: దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకోండి.. ఆనందంతో పాటు..!!

by Anjali |   ( Updated:2024-10-30 07:28:18.0  )
Eco friendly Diwali: దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకోండి.. ఆనందంతో పాటు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలు దీపావళి(Diwali) పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక్కరోజే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే దీపావళి కోసం జనాలంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, షాపింగ్‌ చేయడం కంప్లీట్ చేశారు. ఇక పండగ జరుపుకోవడమే మిగిలి ఉంది. అంతా బాగానే ఉంది. కానీ దీపాలతో పాటు టపాసులు పేల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం(Environmental pollution) జరిగే అవకాశం ఉంది. వాయుకాలుష్యం అవుతుంది.ఈ క్రమంలో వ్యర్థాలు కూడా పర్యావరణ క్షీణతకు కారణమవుతాయి. కాగా అందుకే ఎకో దీపావళికి ప్రాధాన్యతనివ్వాలంటున్నారు నిపుణులు. ఎకో ఫ్రెండ్లీగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ ఐడియాస్ మీ ఒకసారి ట్రై చేయండి.

మట్టి దీపాలను ఎంచుకోండి..

దీపావళి నాడు ప్లాస్టిక్ వాడే బదులు సహజ, బయోడిగ్రేడబుల్(Biodegradable) వస్తువుల్ని వాడండి. సింథటిక్ పదార్థాల(synthetic materials)కు కూడా దూరంగా ఉండండి. అలాగే మట్టి దీపాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. దీపాలు దీపావళి అలంకరణలో ఒక సంప్రదాయ భాగం. అలాగే అలంకరణ కోసం తోరణాల్ని సహజమైన లేదా రీసైకిల్ చేసిన తోరణాల్ని ఎంపిక చేసుకోండి. ప్లాస్టిక్ తోరణాల్ని కాకుండా మామిడాకులవి, పాత క్లాత్ ను తోరణాలుగా తయారు చేయవచ్చు. దేవుడి పూజ కోసం, తలుపులకు పువ్వులు కట్టడం కోసం తాజా పువ్వుల్ని, ఆకుల్ని వాడండి. మల్లె, గులాబీ, బంతిపూలు వంటివి ఇంటికి సహజ పరిమళాన్ని తెస్తాయి.

బాల్కానీలో సోలార్ లైట్లను ఏర్పాటు చేసుకోండి..

కరెంట్ వినియోగాన్ని తగ్గించడానికి బాల్కానీలో సోలార్ లైట్ల ఏర్పాటు చేసుకోండి. పొడి బియ్యం, గోరింటాకు పొడ,పసుపు, కుంకుమ వంటి వాటితో రంగోలిని రెడీ చేయండి. ఆర్గానిక్ రంగోలి(Organic Rangoli) పౌడర్, పూల రేకులను వాడండి. ఇంటి ముందు ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందంటంటారు. కాగా రసాయన ఆధారిత కలర్స్ వాడే కన్నా సేంద్రీయ రంగుల్ని ఉపయోగించండి. అలాగే బియ్యం పిండిని కొన్ని నీళ్లలో కలిపి సంప్రదాయ రంగోలి డిజైన్లు తయారు చేయవచ్చు. ఇది పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. దీపావళికి గిఫ్ట్స్ ఇచ్చుకునేవారు ఎకో ఫ్రెండ్లీ గిఫ్టు(Eco-friendly gift)లను ఎంపిక చేసుకోండి.

చర్మ సంరక్షణ కోసం హోంమేడ్ సోప్స్ వాడండి..

ఇండోర్ మొక్కల్ని(indoor plants) బహుమతిగా ఇవ్వండి. అలాగే చర్మ సంరక్షణ కోసం హోంమేడ్ సబ్బుల్ని(homemade soaps) వాడండి. దీపావళికి స్వీట్స్ తో పాటుగా డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్(Dry Fruits Gifts) గా ఇవ్వండి. రాత్రి ఆనందం కోసం కాల్చే టాపాసులు తక్కువ పొగ వచ్చేవి ఎంచుకోండి. గ్రీన్ కాకర్స్ అయితే మేలు. చిచ్చుబుడ్డీ భూచక్రం అయితే ఎక్కువగా సౌండ్స్ రావు. అంతేకాకుండా ఇవి మరింత హ్యాపీనెస్‌ను ఇస్తాయి. ఇలా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటే ఆనందంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed