Bandhavgarh Tiger Reserve: షాకింగ్.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ లో ఏడు ఏనుగులు మృతి

by Y.Nagarani |   ( Updated:2024-10-30 07:34:37.0  )
Bandhavgarh Tiger Reserve: షాకింగ్.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ లో ఏడు ఏనుగులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో ఉన్న బాంధవ్‌గఢ్‌ టైగర్ రిజర్వ్ లో (Bandhavgarh Tiger Reserve) ఏడు అడవి ఏనుగులు మరణించినట్లు అక్కడి అటవీశాఖ అధికారి వెల్లడించారు. వాటిలో మూడింటిని ఆడ ఏనుగులుగా, ఒక మగ ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. 13 ఏనుగుల సమూహంలో ఏడు మృతి చెందగా.. మరో మూడు ఏనుగులు చికిత్స పొందుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాటికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని, ఆ రిపోర్టు వస్తే ఏనుగుల మృతికి గల కారణాలు తెలుస్తాయని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ వర్మ తెలిపారు. జబల్ పూర్ స్కూల్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ అండ్ హెల్త్ అధికారులు వాటికి పోస్టుమార్టం చేస్తున్నారు.

ఏనుగులు ఏదైనా విషపూరితమైన ఆహారం తిని ఉండవచ్చని, లేదా ఎవరైనా వాటికి మత్తు పదార్థాలు పెట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జబల్ పూర్, భోపాల్ కు చెందిన స్పెషలైజ్డ్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ (STSF) బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు బాంధవ్ ఘర్ రిజర్వ్ అధికారులు, వన్యప్రాణుల వైద్యులు డెహ్రాడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Wildlife institute of india) నిపుణులతో టచ్ లో ఉన్నారు.

Advertisement

Next Story