- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyundai: బ్యాటరీ పరిశోధనల కోసం దేశంలో హ్యుండయ్ రూ. 60 కోట్ల పెట్టుబడులు
దిశ, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ మేజర్ హ్యుందాయ్ మోటార్ గ్రూప్ మంగళవారం వివిధ దేశీయ ఐఐటీలతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) ఢిల్లీ, బాంబే, మద్రాస్‌లతో కలిసి బ్యాటరీ, విద్యుదీకరణ సంబంధిత పరిశోధనలను నిర్వహించడానికి రాబోయే ఐదేళ్లలో సుమారు 7 మిలియన్ డాలర్ల(రూ. 60 కోట్ల వరకు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ఐదేళ్ల పాటు కొనసాగుతుందని, సాఫ్ట్‌వేర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వంటి రంగాలకు విస్తరించడంతో పాటు బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపింది. దీనికోసం ఢిల్లీ ఐఐటీలో హ్యూండాయ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా భారత మార్కెట్లో బ్యాటరీ, ఎలక్ట్రిఫికేషన్ అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా ఉంటుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అభివృద్ధికి సహకారం అందించడం, విస్తరణ కోసం ఐఐటీ ఢిల్లీలో ఉన్న ఏకైక ఈవీ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ రీసెర్చ్ అండ్ ట్రైబాలజీ(సీఏఆర్‌టీ)తో కలిసి పనిచేయనున్నట్టు హ్యూండయ్ వెల్లడించింది.