- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
దిశ, జవహర్ నగర్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం ఉదయం గం. 6:45 ని. లకు వికలాంగుల కాలనీలోని ఓపెన్ గ్రౌండ్ వద్ద సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని స్థానికులు పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా అతను భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. నలుపు రంగు టీ షర్ట్, బ్లూ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడు. రెండు కాళ్ళ మీద పాత కమిలిన గాయాలు, కుడి చేయి మీద లక్ష్మీ అనే పేరు తెలుగులో ఉన్నది.
అలాగే ఎంఆర్ అనే పేరు కూడా కలదు. రెండు చేతుల మణికట్టు వద్ద నలుపు రంగు దారాలు కలవు. అతనికి తల వెనుక భాగంలో గాయం కలదు. బహుశా ఆ గ్రౌండ్ లో వాహనాలు పార్కు చేయడం వల్ల ఆ గుర్తులు వ్యక్తి రాత్రి గ్రౌండ్ లో నిద్రపోతున్నప్పుడు ఏదైనా వాహనం తల మీద నుండి పోవడం వల్ల చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా అక్కడి నుండి ఏదో గుర్తు తెలియని వాహనం స్పీడ్ గుర్తులను పరిశీలించారు. కావున అట్టి వ్యక్తిని గుర్తుపట్టిన వారు స్థానిక పోలీసు స్టేషన్ కు (సీఐ 87126 62097) సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.