Beauty tips: చర్మ సౌందర్యానికి చెరుకు రసం

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-04 15:57:21.0  )
Beauty tips: చర్మ సౌందర్యానికి చెరుకు రసం
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలో ఎక్కువగా పండే పంటలో చెరుకు ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో చెరుకు ప్రధాన ఉత్పత్తి. ఇందులో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా అత్యంత మేలు చేస్తుంది. చలికాలంలో చాలామంది వేడి పదార్థాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, నిజానికి ఈ వింటర్ సీజన్‌లో చెరుకు రసం తీసుకోవడం వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి, రోగనిరోధకత, ఎముకలను దృఢంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి మేలు కలిగిస్తుంది. చెరుకు రసం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చెరుకు రసంలో గ్లైకోలిక్ ఆల్ఫా మైడ్రాక్సీ వంటి ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో తోడ్పడుతుంది. అన్నీ రకాల చర్మ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.

* మూడు టేబుల్ స్పూన్ల చెరుకు రసంలో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్‌ని క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు రోజులు చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

* చెరుకు రసంలో కొద్దిగ ముల్తానీ మట్టిని కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోయి, చర్మ కణాలను మెరిసేలా చేస్తుంది.

* తేనెతో చెరుకు రసంను కలిపి చర్మానికి 5 నిమిషాల పాటు మర్ధనా చేయాలి. 10 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి కడిగగేయాలి. వారానికి 3 సార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

* కాఫీ పొడిలో కెఫిన్, ఇతర గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి. కాస్త చెరుకు రసంలో కొంచెం కాఫీ పొడిని కలిపి స్క్రబ్‌లా ఉపయోగించడం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

* చాలామంది ముఖానికి ఐస్‌క్యూబ్స్ వాడుతుంటారు. ఇలా మాములూ ఐస్‌క్యూబ్‌లు కాకుండా చెరుకు రసంతో తయారు చేసిన వాటిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

* 2 టేబుల్ స్పూన్ల చెరుకు రసంలో 1 స్పూన్ తేనె, కొద్దిగా పెరుగు, కొంచెం శనగపిండి కలుపుకుని స్క్రబ్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

Read More...

Coconut Water: కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?





Advertisement

Next Story

Most Viewed