- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy: పెద్దపల్లి జిల్లా వాసులకు భారీ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ వరాల జల్లు

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా (Peddapally District)పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆ జిల్లాకు రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్‌ను, ఓ ట్రాఫిక్ పోలీస్ స్టేషనను మంజూరు చేశారు. అదేవిధంగా ఎలిగోడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశారు. పెద్దపల్లి (Peddapally) ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. మంథని (Manthani)లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంజపడుగు (Gunjapadugu)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పెద్దపల్లి (Peddapally)కి ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు మంజూరైంది. కాగా, నేడు పెద్దపల్లిలో జరిగే ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేయనున్నారు.