- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముస్లింల అభ్యున్నతికి కృషి :మంత్రి

దిశ,కోదాడ : ముస్లిం మైనార్టీల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఎండి జబ్బర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ పార్లమెంటులో వక్ఫ్ బోర్డు యమన్ మెంట్ యాక్ట్ తేవాలని ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎంపీలంతా ఈ యాక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. కర్ణాటక ప్రభుత్వంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రం సహితం ముస్లిం మైనార్టీలకు రక్షణగా ఈ యాక్ట్ అమలు కాకుండా ముఖ్యమంత్రి సంవత్సరం మంత్రులతో చర్చించి కృషి చేస్తానన్నారు
గత రెండు దశాబ్దాలుగా కోదాడ హుజూర్ నగర్ ముస్లిం మైనార్టీలతో ఎంతో ఆత్మీయత తనకు ఉందన్నారు. ఉత్తంకుమార్ ఆప్కా భాయ్ అంటూ ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. హుజూర్ నగర్ లో షాదీ ఖానా కోదాడలో ఈద్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాను అన్నారు. ముస్లిం సోదరులకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా గెలిచినా ఓడినా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రజలే తన కుటుంబంగా భావిస్తున్నానన్నారు.
ముస్లిం సోదరులకు ప్రతి ఏడాది జబ్బర్ భాయ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కోదాడ మైనారిటీ సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు ఎర్నేని బాబు, పారా సీతయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, కె.ఎల్.ఎన్ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు , మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్ బాజాన్, బాగ్దాద్, ఎజాజుద్దీన్, మునావర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పలు హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.