- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా గైని శివాజీ

దిశ,తాడ్వాయి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ విభాగపు అధ్యక్షుడిగా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన గైని శివాజీ నియమించినట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రితమ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గైని శివాజీ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో తనకు బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు దళితుల సంరక్షణతో పాటు.. సంరక్షణ తో పాటు వారు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు లింగాగౌడ్,తాడ్వాయి మండల అధ్యక్షులు వెంకటరెడ్డి,సదాశి నగర్ ఎస్సి విభాగం మండల అధ్యక్షులు కవిన్,తాడ్వాయి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాజేందర్,నగర మండల యూత్ అధ్యక్షులు అన్వేష్ గౌడ్,నగర్ మండల మైనార్టీ ప్రెసిడెంట్ సాదిక్ ఆలీ, మహిపాల్,సీనియర్ నాయకులు మాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.