- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Actor Bhargavi : ఫేక్ న్యూస్ పై నటి తీవ్ర ఆగ్రహం

దిశ, వెబ్ డెస్క్ : తనపై వస్తున్న ఫేక్ న్యూస్(Fake News) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఓ టాలీవుడ్ నటి. తనపై తన కుటుంబంపై తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని యాంకర్, నటి భార్గవి(Actor Bhargavi) మండిపడ్డారు. ఇటీవల భార్గవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇచ్చింది. దానిలో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న తన భర్త గురించి, ఆయన కష్టాల గురించి చెప్పగా.. సదరు యూట్యూబ్ ఛానెల్ వారు మాత్రం తప్పుడు అర్థం వచ్చేలా థంబ్ నెయిల్స్ పెట్టి, వీడియో పోస్ట్ చేశారు. దీనిపై భార్గవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భర్త చనిపోయిన్నట్టు ఉన్న థంబ్ నెయిల్స్ ఉండటంతో.. ఇది మీకు తగునా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేసిన భార్గవి.. అందులో తన భర్తని చూపించింది. తన భర్త ఇంకా బతికే ఉన్నాడని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఏమిటని నిలదీసింది. ఈ వ్యవహారంపై ఆ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు సమాధానం చెప్పి, బహిరంగ క్షమాపణ అడగాలని డిమాండ్ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా టీవీ యాంకర్ స్వప్న ఆడగడం వల్లే తాను ఈ ఇంటర్వ్యూ ఇచ్చానని.. కాని ఇలా బాధ్యతారహితంగా ఎలా ఉంటారని భార్గవి వీడియోలో ప్రశ్నించింది.