రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి..

by Naveena |
రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆర్ఎస్ కె ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం కుటుంబాలకు ఈ రంజాన్ మాసం విశేషం అయ్యిందని అన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా సహకారం అందించాలనే లక్ష్యంతో స్వచ్ఛందంగా సుమారు 110 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం పాండు, ఎడ్ల సత్తి రెడ్డి, సుబ్బురి బీరు మల్లయ్య, సందెల సుధాకర్, కేశపట్నం రమేష్, అతికం లక్ష్మీనారాయణ, అబ్బగాని వెంకట్ గౌడ్, తాజ్పూర్ మాజీ సర్పంచ్ బొమ్మారం సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story