- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాహిత్య రంగంలో మహిళల పోటీ అభినందనీయం

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పాలమూరు మహిళలు పురుషులతో పోటీ పడుతూ సాహిత్య రంగంలో చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప అన్నారు. ఆదివారం తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు,హైదరాబాద్ ప్రమీల శక్తి పీఠం ఆధ్వర్యంలో,అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలు,సిస్టర్స్,సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. అనంతరం కంద పద్య కవి డా.కె.బాలస్వామి రచించిన 'నమో శిల్పి' పుస్తకాన్ని ఆవిష్కరించారు.
విశిష్ట అతిథి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి మాట్లాడుతూ.. పాలమూరు మహిళలు సాహిత్య సంస్కృతిక సంస్థను స్థాపించి,వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు 'మహిళా శక్తి' పురస్కారాలు,సాహితీ వేత్తలకు ఉగాది పురస్కారాలు అందజేయడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమానికి చుక్కాయపల్లి శ్రీదేవి,శాంతా రెడ్డిలు అధ్యక్షత మహించగా సమాజ సేవకులు డాక్టర్.లక్కరాజు నిర్మల,గాయకురాలు జ్ఞాన ప్రసూన శర్మ,కవయిత్రి సుజాత,చిత్రం కారిణి బాలసరస్వతి,గాయని చంద్రకళ లకు 'మహిళా శక్తి' పురస్కారాలు అందజేశారు.అనంతరం జరిగిన కవి సమ్మేళనం లో 70 కవులు కవితా గానం చేయగా వారిని మెమోంటో,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కవులు రావూరి వనజ,పొద్దుటూరి ఎల్లారెడ్డి,లక్ష్మణ్ గౌడ్,డా.మాడ పుష్పలత,దేవదానం,రాజగోపాలాచారి,వల్లభాపురం జనార్థన్,ఖాజామైనోద్ధీన్,కొప్పుల యాదయ్య,వనజ,జమున,పద్మావతి,సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.