- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

దిశ, జగిత్యాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ఖిలగడ్డ కమ్యూనిటీ హాల్, రాయల్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఖర్జూరం, ఫలహారాలు తినిపించి దీక్షను విరమింప చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కుల, మత తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో మజీద్ లకు, ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం జరిగింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూ చత్రు, ఎంఆర్ఓ రామ్మోహన్, డీఎస్పీ రఘు చందర్, గిరి నాగభూషణం, టీవీ సూర్యం, అడువాల లక్ష్మన్, గోలి శ్రీనివాస్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.