- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సై మృతికి ఆ యువతీ కారణమా...?
దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రుద్రారపు హరీశ్ (20) ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారగా ఆత్మహత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఎస్సై ఆత్మహత్య పై మొదట్లో అనేక అనుమానాలు వెలువడిన… ఘటన స్థలంలో ఎస్సై భౌతిక దేహం వద్ద ఒక యువతి ఉన్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో ఎస్సై మృతికి కారణం ఆ యువతి అని అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ముళ్లకట్ట వంతెన వద్ద గల ప్రైవేట్ రిసార్ట్ లో తన సర్వీస్ రివాల్వర్ తో వాజేడు ఎస్సై హరీష్ కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు సైతం ఘటన స్థలంలో ఉన్న యువతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన యువతిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తుండగా పలు విస్తుపోయే విషయాలు బయట పడుతున్నట్లు తెలుస్తోంది.
సదరు యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించినట్లు, యువతి వేధింపులకు ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు యువతిపై కేసు నమోదు చేసినట్లు వినికిడి. ఎస్సై హరీష్ విషయంలో పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకునేందుకు ఎస్సై అంగీకరించగా తనను పెళ్లి చేసుకోకుంటే అందరి ముందు పరువు తీస్తానని బెదిరించడంతో ఎస్సై తన సన్నిహితులతో యువతి కి రూ. 40 లక్షలు చెల్లిస్తారని మాట్లాడినట్టు, ఆ యువతి ఒప్పుకోకుండా కోటి రూపాయలు డిమాండ్ చేయగా అదే విషయం పై ఆదివారం రిసార్ట్ కు ఎస్సైని కలవడానికి యువతి వచ్చిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎస్సై హరీష్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండడంతో తొందరలోనే ఆత్మహత్య కారణాలు వెలువడే అవకాశం ఉంది.