- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద ముప్పును అధిగమించడానికి హైడ్రా ప్రణాళికలు
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో వరద ముప్పును అధిగమించేందుకు హైడ్రా సరైన ప్రణాళికలు రచిస్తోందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఈ క్రమంలోనే చెరువుల పునరుద్ధరణ, వాటి అనుసంధానంపై దృష్టి పెట్టామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులపై హెచ్ఐసీసీలో మంగళవారం నిర్వహించిన " జియో స్మార్ట్ ఇండియా -2024"సదస్సులో రంగనాథ్ ప్రసంగించారు. వర్షా కాలం వరద ముప్పు లేని నగరాలు అనే అంశం పెద్ద సవాల్ గా గ్ మారిందాని కమిషనర్ అన్నారు. రెండు సెంటీమీటర్ల వర్షం పడినా నగరంలో వరద ముంచెత్తి ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీంతో ఇంధనంతో పాటు సమయం వృధా అవుతోందని, వాహన కాలుష్యం పెరిగిపోతోందని వివరించారు. ఇండియా వర్షపాతం 118 సెంటిమీటర్లయితే తెలంగాణ 130 సెంటీమీటర్లుందని, హైదరాబాద్లో 89 సెంటీమీటర్ల నమోదు అవుతున్నా... ఒకేసారి ఎక్కువ మొత్తం వర్షం పడడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
నగరంలో కేవలం 0.95 శాతం వర్షం నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందని, నివాస ప్రాంతాలు పెరగడం, చెరువులు నాలలు కబ్జాకు గురి కావడం, వరద కాలనీలను, రహదారులను ముంచెత్తుతోందని చెప్పారు. అందుకే చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, నాలాల ఆక్రమణల తొలగింపు పై దృష్టి పెట్టామని, పార్కులను, ప్రభుత్వ స్థలాలు కాపడుతున్నామని చెప్పారు.చారిత్రక అమీన్ పూర్ చెరువు పరిసరాల్లో ఆక్రమణల తొలగించడంతో వలస పక్షులు వస్తున్నాయని వివరించారు. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్‌పూర్ సరస్సులోకి తూర్పు యూరప్ నుంచి వలస వచ్చిన 12-సెంటీమీటర్ల రెడ్ బ్రెస్టెట్ ఫ్లై క్యాచర్ (పక్షి) మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామని సూచిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా అభినందించడం ఆనందించదగ్గ అంశమని గుర్తుచేశారు. వరద కాలువలను పునరుద్ధరించి గొలుసుకట్టు చెరువులను పునరుద్దరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెరువుల చుట్టుకొలత లెక్కలు తేల్చే పనిలో ఉన్నామని, ఈక్రమంలో వాతావరణ శాఖ సహకారం ఎంతో అవసరమని చెప్పారు.
ప్రస్తుతం వెదర్ రాడార్ ఒక్కటే ఉందని, వీటి సంఖ్య పెంచాలని, అలాగే 157 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, వాటి సంఖ్య రెట్టింపు కావాలని తెలిపారు. ‘సాంకేతికతను అందిపుచ్చుకుని.. వర్షం రాకను, ఎంత మొత్తంలో వస్తోంది..ఏ ప్రాంతాలకు వరద ముప్పు వుంటుంది’అనే సమాచారం ప్రజలకు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జియో స్మార్ట్ ఇండియా సదస్సు చాలా ఉపయుక్తమైన సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక్కడ నేల స్వభావాలను, వరద ముప్పు ఉన్న ప్రాంతాల సమాచారం, కరువు కాటకాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఈ సమాచారంతో ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రంగనాథ్ గారు సందర్శించారు. చెరువులు, పరిరక్షణ, పునరుద్ధరణ పై హైడ్రా చొరవను జియో స్మార్ట్ ఇండియా సదస్సు అభినందించింది.