ACB : చెక్‌పోస్టుల్లో ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా నగదు సీజ్ ఎంతంటే?

by Ramesh N |
ACB : చెక్‌పోస్టుల్లో ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా నగదు సీజ్ ఎంతంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు (RTA Check Posts) ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఏసీబీ (ACB) అధికారులు మెరుపు దాడులు చేశారు. రాష్ట్రవ్యప్తంగా పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ అధికారుల బృందాలు సీజ్ చేశాయి. (నల్గొండ) విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,600, భోర‌జ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, (గద్వాల్) అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్ప‌డుతున్న అధికారుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏసీబీ అధికారులు ప్రకటన వడుదల చేశారు. ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story