- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తాత ప్రధాన మంత్రి.. భర్తేమో స్టార్ హీరో.. ఇక ఈ అమ్మడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్.. ఇంతకీ ఈమె ఎవరంటే..?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరి(aditi rao Hydari) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో అటు దక్షిణాదిలోనూ, ఇటు నార్త్‌లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. అయితే ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అయినట్లు పర్సనల్ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోయిందీ ఈ ముద్దుగుమ్మ. అందుకే మొదటి పెళ్లి ఆరేళ్లకే పెటాకులైంది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఈ బ్యూటీ.. స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth)ను ప్రేమించి ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకుంది. అయితే సిద్ధార్థ్‌కు కూడా ఇది రెండో పెళ్లే. ప్రస్తుతం ఈ జోడీ తన మ్యారీడ్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. అదితి రావు హైదరి రాజుల వంశానికి చెందిన అమ్మాయి. ఆమె తాత (తండ్రి తండ్రి) అక్బర్ హైదరీ.. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రి(Hyderabad PM)గా చేశారు. అలాగే మరో తాత రామేశ్వరరావ్ (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి(Wanaparthy) సంస్థానాధీశునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్(Aamir Khan) మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావ్(Kiran Rao) కూడా అదితికి దగ్గరి బంధువు అవుతుంది. అలా తాతేమో ప్రధానమంత్రి, భర్తేమో స్టార్ హీరో, ఈ అమ్మడు ఏమో పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్నాారు. కాగా 2006లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అదితి.. తెలుగు(Telugu), తమిళ(Tamil), మలయాళ(Malayalam), హిందీ(Hindi) భాషల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఆమె నటించిన సమ్మోహనం(Sammohanam), అంతరిక్షం(Antariksham), వి(V), మహాసముద్రం(Maha Samudram) వంటి సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.